Skip to main content

Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో ఉచిత రక్త పరీక్షలు.

విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

పాలకొల్లు: సెప్టెంబర్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జె కె ఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం పాలకొల్లు వాలంటరీ బ్లడ్ బ్యాంకు వారి సౌజన్యంతో డిగ్రీ విద్యార్థులకు ఉచిత రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్త నిర్ధారణ పరీక్షలు చేయించుకొనుట ద్వారా తమ రక్త గ్రూపు ఓ, ఏ, బి, ఏబి లలో ఏ తరగతికి చెందినదో తెలుస్తుందని, తద్వారా ఏవైనా అనారోగ్య మరియు ప్రమాదాల సమయంలో రక్తం అవసరమైనప్పుడు బ్లడ్ బ్యాంక్ నుండి తమ గ్రూపు రక్తాన్ని సమయభావం లేకుండా చేసి ప్రాణాలు కాపాడుకొనుటకు దోహదపడుతుంన్నారు. రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు పేర్లను నమోదు చేసుకుని అత్యవసర పరిస్థితిలో అవసరం ఉన్న వారికి అందించుటకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి అన్నారు
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరావు గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ ఉచిత రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారి లిస్టులను ఎన్ఎస్ఎస్, ఎన్ సి సి వారు భద్రపరచుట, అత్యవసర పరిస్థితులలో తమ విద్యార్థులు రక్తదానం చేయుటకు ఉపయోగపడుతుందన్నారు
ఈ కార్యక్రమంలో 302 మంది విద్యార్థులకు ఉచిత రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారి వారి రక్త గ్రూపులను విద్యార్థులకు తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి పాలకొల్లు వాలంటరీ బ్లడ్ బ్యాంకు అధినేత పి సత్యనారాయణ, ల్యాబ్ సిబ్బంది, కళాశాల సెక్రటరీ కె.వి సీతారామరాజు, ట్రెజరర్ ప్రవీణ్ భాను, ఎన్ఎస్ఎస్ అధికారులు రాంబాబు, రజిని, రాధా మాధవి ఎన్సిసి ట్రైన సంతోషప్రసాద్ అధ్యాపకులు ఎన్ రవికుమార్, జానకిరామయ్య, తదితరులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.