భీమవరం:సెప్టెంబర్,24
(తెలుగు న్యూస్ పవర్.కామ్)
తుపాను ప్రభావిత,ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు డీ ఈ ఓ తెలిపారు.అన్ని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు ఇతర యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,
కరస్పాండెంట్లకు* ఈ సమాచారాన్ని వెంటనే తెలియజేసి, శుక్రవారం పాఠశాలలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి, ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలకు హాజరు కాకుండా బాధ్యులకు స్పష్టంగా సమాచారం అందించాలని డి ఈ ఓ ఆదేశాలు ఇచ్చారు..
నేడు కూడా అన్ని పాఠశాలకు సెలవు.