పాలకొల్లు:సెప్టెంబర్,24
(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉదయం గం 8 ల నుంచి సాయంత్రం గం. 6 ల వరకు రికార్డు స్థాయి లో 106.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహశీల్దార్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి, సాధారణ జనజీవనంపై ప్రభావం చూపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో తీరం దాటిన డీప్ డిప్రెషన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.తుఫాను
ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం పాఠశాల లకు శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు.
పాలకొల్లులో భారీ వర్షం.. 106.2 మి.మీ వర్షపాతం నమోదు.