పాలకొల్లు: సెప్టెంబర్,26( తెలుగు న్యూస్ పవర్.కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో కళాశాల ప్లానింగ్ డెవలప్‌మెంట్ కమిటీ (సీపీడీసీ ) సెక్రటరీగా సేవలందించిన డాక్టర్ బి వి రాఘవయ్య గారి సంతాప సభ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం అధ్యక్షతన కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం మాట్లాడుతూ, డా. బి వి రాఘవయ్య, కళాశాల అభివృద్ధికి అందించిన సేవలను, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన సేవలు కళాశాల అభివృద్ధిలో ప్రత్యేకమైనవని, ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కళాశాల ప్లానింగ్ డెవలప్‌మెంట్ కమిటీ (సిపిడిసి) సభ్యులు డాక్టర్ ఎస్.వి. రంగారావు, అద్దేపల్లి మోహన్ దాస్, కారుమూరి రామలింగేశ్వరరావు, శ్రీనాథ్, వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్లానింగ్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, డాక్టర్ బి.వి. రాఘవయ్య, కమిటీ సెక్రటరీగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కళాశాల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన సేవా దృక్పథం, అంకితభావం, సహచరులతో స్నేహపూర్వకంగా మెలిగే విధానం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఐక్యూఎసి కోఆర్డినేటర్ డాక్టర్ బి. వెంకట స్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ జి. సుమలత, జెకెసి కోఆర్డినేటర్ కె. శామ్యూల్, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎం రామకృష్ణ,డాక్టర్ వి డి వి విజయలక్ష్మి, సూపరిండెంట్ బి. కనకలక్ష్మి, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
