
పాలకొల్లు:సెప్టెంబర్27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ఉదయం 9 గంటలకు భగవద్గీత మహా యజ్ఞం వైభవంగా జరిగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో భగవద్గీత పారాయణం చేసారు. భగవద్గీత పారాయణం చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి, రేపాక శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, భక్తులు 1000 మందికి అన్నప్రసాదం ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో
ధర్మకర్త లు ఉప్పలపు దుర్గ పెద్దిరాజు, నాలం నాగ వెంకట సురేఖ,పినిశెట్టి శ్రీనివాస్,వందరపు కుమారి, నీలాపు సింహాచలం, నీలాపుమని, ప్రధాన అర్చకులు అనిల్ , అర్చకులు వీరబాబు,ఆలయ సూపరింటెండెంట్ పి. వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
