Skip to main content

Telugu News Power

సమాజ సేవకులు క్షత్రియులు. – మాజీ మంత్రి, ఎంపీ కనుమూరి.

పాలకొల్లు క్షత్రియ పరిషత్ సమావేశ దృశ్యం

పాలకొల్లు: సెప్టెంబర్, 28
( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్షత్రియులు సమాజ సేవకులని, క్షత్రియ ప్రముఖులు, మాజీ మంత్రి, ఎంపీ కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు. స్థానిక క్షత్రియ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బాపిరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షత్రియలు ఐక్యమత్యంతో సమాజ ప్రగతి కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు దాట్ల రమేష్ రాజు అధ్యక్షత వహించారు. డాక్టర్ కె ఎస్ పి ఎన్ వర్మ కార్యదర్శిని వేదిక సమావేశంలో సమర్పించారు. కనుమూరి సీతారామరాజు వార్షిక నివేదిక సమావేశంలో ప్రవేశపెట్టారు. సమాజ ప్రగతి కోసం క్షత్రియులు సేవకులుగా ఎల్లవేళలా ముందు ఉంటారని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాజ సేవలో గుర్తింపు లేని వారిని పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో, చేకూరి సూరిబాబు, భూపతి రాజు విశ్వనాథరాజు, వేగేసిన రంగరాజు, డిటిడిసి బాబు, కలిదిండి కృష్ణ వర్మ, చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, ఏ వి రామకృష్ణ రాజు, పెనుమత్స బుద్ధ రాజు, బిఎస్ఎన్ఎల్ రాజు, బిజెపి మహిళా మోర్చా నాయకురాలు, అల్లూరి పద్మ వర్మ పలువురు క్షత్రియ ప్రముఖులు సమావేశంలో పాల్గొన్నారు.