పాలకొల్లు: అక్టోబర్,3( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక విజయ మెడికల్ ల్యాబ్ అధినేత, కొమ్ముల మురళీకృష్ణ స్వచ్ఛ ఆంధ్ర మిషన్ పురస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా, మున్సిపల్ శాఖ మాత్యులు పి నారాయణ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, చైర్మన్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సమక్షంలో విజయవాడలో గాంధీ జయంతి రోజు అందుకున్నారు. ఈ సందర్భంగా, నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో మురళి మాట్లాడారు. పలుచోట్ల మొక్కలు నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 500 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినట్లు వివరించారు. లయన్స్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సంస్థ, వివిధ విద్యాలయాల ద్వారా సామాజిక సేవ చేస్తున్నట్టు మురళి పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మురళీకృష్ణను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు.
విజయా ల్యాబ్ అధినేత మురళి కృష్ణకు స్వచ్చంధ్ర పురస్కారం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పురస్కారం అందుకుంటున్న మురళీకృష్ణ