Skip to main content

Telugu News Power

ప్రారంభించకుండానే కూలిపోయిన డ్రయిన్. -వైసీపీ నాయకుల ఆరోపణ.

కూలిన సిమెంటు డ్రైన్ నిర్మాణం

యలమంచిలి: అక్టోబర్,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏనుగువానిలంక గ్రామంలో నిర్మించిన సిమెంటు డ్రైయిన్ ప్రారంభించకుండానే కూలిపోయింది, గ్రామ వైసిపి పార్టీ అధ్యక్షులు మల్లుల కొండ శనివారం ఆరోపించారు. లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన డ్రైయిన్ నిర్మాణంలో అవతలపై అధికారులపై చర్య తీసుకోవాలని కొండ డిమాండ్ చేశారు.

స్మశాన వాటిక చందాలు ఆపాలి.
గత వైసిపి ప్రభుత్వం హయాంలో స్మశానం కోసం రూ. 30 లక్షలు కేటాయించిందని జిల్లా యువజన విభాగం కార్యవర్గ సభ్యులు కులం పార్టీ జాన్ శనివారం తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో కూటమి నాయకులు, స్మశానం కోసం చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వీరిపై వెంటనే చర్యలు తీసుకుని చందాలు వసూలు ఆపు చేయాలని కోరారు.