పాలకొల్లు:అక్టోబర్,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ తపాలా దినోత్సవం, స్థానిక యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి యు కె ఎస్ సి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్లబ్ అధ్యక్షులు, డాక్టర్ సంగినీడి సూరిబాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, హెడ్ పోస్ట్ మాస్టర్, గాజులపాటి సూర్య నారాయణకు,ప్రజలకు ఉత్తమ తపాలా సేవలు అందిస్తున్న ఉద్యోగులు, మేడపాటి కరుణానిధి, వాసా కుమారస్వామిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో, వ్యవస్థాపకులు పోకల రాము,సహాయ గవర్నర్, జక్కంపూడి మదన్మోహన్,ప్రధాన కార్యదర్శి గంధం ఏసు పాదం, కోశాధికారి, సిరిగినీడి రాంబాబు, క్లబ్ సభ్యులు సభ్యులు గుండుమోగుల వీరస్వామి, యర్రంశెట్టి వెంకటరత్నం, కానూరి ప్రభాకర్ రావు, కర్ర నరసింహారావు, కొట్టి భాస్కరరావు, యాతం రమేష్, చేగొండి ప్రభాకర్, ఖగరాజు, ఫణి, కూనపురెడ్డి చిన్న, భీమనాదం సత్యనారాయణ, తప్పక కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొట్టి భాస్కరరావు సేకరించిన తపాలా సామాగ్రి ప్రదర్శన ఆకట్టుకుంది.
యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో తపాలా దినోత్సవం.
తపాలా ఉద్యోగులను సత్కరిస్తున్న దృశ్యం