Skip to main content

Telugu News Power

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

శరన్నవరాత్రుల మొదటి రోజు శ్రీ హైమావతి ఈశ్వరి దేవి రూపంలో అనుగ్రహ దర్శనం.
శరన్నవరాత్రుల మొదటి రోజు శ్రీ హైమావతి ఈశ్వరి దేవి రూపంలో అనుగ్రహ దర్శనం.

పాలకొల్లు: అక్టోబరు,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఆదివారం ఉదయం శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కలశ స్థాపన పూజలు చేశారు. శ్రీ అమ్మవారు, హైమవతి ఈశ్వరీ దేవి అలంకరణలో అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, దంపతులు కలశ స్థాపన పూజల ప్రారంభించారు. అభిషేక్ పండిట్ భమిడిపాటి వెంకన్న , మద్దూరు సూరిబాబు, , ధర్మకర్తలమండలి అధ్యక్షుల దంపతుల చే కలశ స్థాపన పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆర్. శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త బాసిన సత్యనారాయణ, కొండ్రెడ్డి సూరిబాబు, ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు.
స్థానిక ఎడ్ల బజారులో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో, శరన్నవరాత్రుల ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా, అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు వాడవాడలా, పట్టణం లో వివిధ వార్డుల్లో దేవీ నవరాత్రుల ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవమూర్తులు పీఠాలను అధిష్టించి, స్థానిక భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా పలుచోట్ల విద్యుత్ కాంతుల్లో శరన్నవరాత్రి శోభ ఇనుమడిచింది.

కలశ స్థాపన పూజలు నిర్వహిస్తున్న చైర్మన్ దంపతులు