
ఈ సందర్భంగా శ్రీ అమ్మవారు స్వర్ణ రజిత కవచాలంకారంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇస్తున్నారు. శ్రీ అమ్మవారిని ఏలూరు జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్లు,అభిషేక్ గౌడ్, కల్పన శ్రీ దంపతులు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మల్లికార్జున శర్మ, వేదపండితులు పూజ, ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం,చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికేలా ఆంజనేయ ప్రసాద్,,మిర్తిపాఠి గున్నేశ్వరరావు, గుసిడి నాగ శిరీష,,అరసవల్లి సుబ్రహ్మణ్యం,యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపోలు ఏడుకొండలు, చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.