
విజయవాడ: అక్టోబర్, 14
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
శరన్నవరాత్రుల సందర్భంగా, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. రాష్ట్రపతికి స్థానిక ఎంపీ కేసినేని శివనాథ్, చిన్ని, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ లక్ష్మి శా, ఆలయ ఈవో సీనా నాయక్, ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి అనుగ్రహ దర్శనంతో ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా వేద పండితులు రాష్ట్రపతి, వేదాశీర్వచన పూజలు జరిపారు. ఆలయ సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ దంపతులు, అధికారులు పాల్గొన్నారు.విజయవాడ విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి సాదర స్వాగతం పలికాను. ఇంద్రకీలాద్రిపై పూజా కార్యక్రమం పూర్తిచేసుకుని,
జాతీయ స్థాయి సరస్ అజీవికా మేళాను ప్రారంభించేందుకు రాష్ట్రపతి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమం రాష్ట్రపతి పాల్గొనడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులు, నైపుణ్యాలు, విజయగాథలకు మరింత గుర్తింపు తీసుకురానుందని,
గ్రామీణ మహిళల ప్రతిభకు జాతీయ వేదిక కల్పిస్తూ, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి భాగస్వామ్యం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని. కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్లా నజీర్ పాల్గొన్నారు.
