
పాలకొల్లు: అక్టోబర్, 14
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
తెలుగు భాషా విశిష్టతను వివరిస్తూ సాగిన, కవి సమ్మేళనం ఎంతగానో అలరించిందని, రాజ్యసభ సభ్యులు పాప సత్యనారాయణ పేర్కొన్నారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్, ఎంపీ, పాక సత్యనారాయణకు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావుకు బుధవారం స్థానిక మాంటిసోరి పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలోజీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా, ఎంపీ పాక సత్యనారాయణ మాట్లాడుతూ, భాషను సుసంపన్ను చేయటానికి, ఆచార వ్యవహారాలు పడతాయి అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, జీవన సాఫల్యం పురస్కార గ్రహీత మాట్లాడుతూ, చదవడం ద్వారా భాష అభివృద్ధి చెందుతుందన్నారు. ఎందరో మహానుభావులు పురస్కారాలు అందుకున్న వేదికపై తాను పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. స్థానిక ప్రముఖులు పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, దర్శి శ్రీనివాసు గుప్తా, చెరుకూరి సూరిబాబు, ఇమ్మడి రాజేష్, మద్దాల వాసు, సీఐ రజిని కుమార్, ముత్యాల రామారావు, బోళ్ల శ్రీనివాస్, గుడాల హరిబాబు లను వాగ్దేవి విశిష్ట సేవ పురస్కారాలతో సత్కరించారు.
కవి సమ్మేళనం లో పాల్గొన్న కవులను సత్కరించారు. బాలలు ఈ కవి సమ్మేళనంలో పాల్గొనటం విశేషం. ఈ కార్యక్రమంలో, సారస్వత పరిషత్, కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కేసిరాజు రాంప్రసాద్, అధ్యక్షులు శ్రీనివాస్, డాక్టర్ కె ఎస్ పి ఎన్ వర్మ, కన్వీనర్, డాక్టర్ కోలాటి పెద్దిరాజు తదితర సభ్యులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.