Skip to main content

Telugu News Power

ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యాదాత వేగేశ్న అస్తమయం.

పాలకొల్లు: అక్టోబర్,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ పారిశ్రామికవేత్త, రైస్ మిల్లింగ్ వ్యాపారంలో ఎందరికో మార్గదర్శి, వేగేశ్న రంగరాజు, (75) గురువారం మధ్యాహ్నం స్వగృహంలో, ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. రంగరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రైస్ మిల్లింగ్ పరిశ్రమలు అగ్రస్థానంలో నిలిచారు. ఈ రంగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. రంగరాజు విద్యారంగానికి భూరివిరాళం ఇచ్చి ప్రోత్సహించారు. చాంబర్స్ కళాశాల చరిత్రలో రంగరాజు పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. వీరి మృతి పట్ల రైస్ మిల్లర్ల సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంఘ అధ్యక్ష,ఉపాధ్యక్షులు, జడ్డు గాంధీ బాబు, పెనుమత్స సతీష్, కార్యదర్శి వేగేశ్న రామచంద్ర రాజు, సహాయ కార్యదర్శులు, మామిడి వెంకట శ్రీరంగరాజీవ్, దేవరపు అజయ్ కుమార్, కోశాధికారి, అద్దేపల్లి రామచంద్ర రావు రంగరాజుకు నివాళులర్పించారు. వారి కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఛాంబర్స్ కళాశాల చైర్మన్, కారుమూరి వెంకట నరసింహ రావు, వివిధ వ్యాపార సంఘాలు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.