పాలకొల్లు: అక్టోబర్, 21
( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ ఎన్నికల కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఎంపీటీసీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, పి మురళీకృష్ణ, తహసీల్దార్ యడ్ల దుర్గా కిషోర్ నామినేషన్ పత్రాలు స్వీకరించి, పరిశీలించారు. విల్లూరి రత్నం రాజు చందపర్రు, అడిదెల సుధాకర్, ఆగర్రు, విప్పర్తి గ్రేస్ కుమారి తిల్లపూడి, ర్యాలీ వెంకట సుబ్బారావు, శివదేవుని చిక్కాల, వడ్లపాటి సరోజిని, తిల్లపూడి నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. మీరంతా వైసిపి పార్టీకి చెందిన అభ్యర్థులు.
ఆకుల సోమ సురేష్, లంకల కోడేరు -1, జి. పెద్దిరాజు, లంకల కోడేరు వీరిరువు టిడిపి టిడిపి అభ్యర్థిగా నామినేషన్లు వేశారు.
సాయి లక్ష్మి, తిల్లపూడి 1 ఎంపీటీసీ స్థానానికి జనసేన తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు.