Skip to main content

Telugu News Power

కాస్మో క్లబ్ టెన్నిస్ పోటీల్లో హోరాహోరీ గా ఆఖరి పోరు.

పాలకొల్లు టౌన్ హాల్ టెన్నిస్ కోర్టులో తుది పోరు
పో రును ఉత్కంఠతో వీక్షిస్తున్న క్రీడాకారులు

పాలకొల్లు: అక్టోబర్, 21
(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో, జాతీయస్థాయి సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు బుధవారం, సింగిల్స్, డబుల్స్(45-75 వయసు పైబడి)వివిధ కోర్టులో నువ్వా నేనా అన్నట్టు జరిగిన ఆఖరి హోరాహోరీ పోరులో గెలిచిన వారు విజేతలయ్యారు. నిర్వాహకులు, వివిధ కోర్టుల నుంచి సేకరించి విజేతల వివరాలు వెళ్లాడిస్తామని తెలిపారు. పాలకొల్లు టౌన్ హాల్ కోర్టులో టెన్నిస్ ఆటను సాటి క్రీడాకారులు ఆసక్తి గా తిలకించారు. ఐస్టా, ఏ పి ఎస్ టీ పి ఏ ఆధ్వర్యంలో, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సౌజన్యం తో అఖిల భారత స్థాయి లో ఏటా ఈ భారీ క్రీడా సంబరాలు వారం రోజులపాటు కనువిందు చేస్తున్నాయి. ఎందరికో క్రీడస్ఫూర్తి కలిగించి, యువతను ఈ క్రీడలవైపు మళ్ళించడానికి తీవ్ర కృషి చేస్తున్నారు. అఖిల భారత స్థాయి లో ఈ క్రీడలు నిర్వహించడం 18 ఏళ్ళ క్రితం చెరుకూరి బుద్దావతారం రాజు ప్రారంభించారు. ఆమేరకు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ఘనమైన కీర్తి, ప్రతిష్టలకు పునాదులు వేశారు. వారి జ్ఞాపకార్ధం నాటి నుంచి నిర్విగహ్నం గా కొనసాగిస్తున్నారు.