Telugu News Power

Telugu News Power

నేడు ఎలుకల మందు పంపిణీ

యలమంచిలి: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలంలో సామూహి ఎలుకల నిర్మూలనలో భాగంగా విషపు ఎర ఉచితంగా పంచుతున్నట్టు వ్యవసాయ అధికారి డి. బాలా త్రిపుర సుందరి మంగళవారం తెలిపారు. రైతులు పొలాల్లో ఎలుకల బొరియలు పూడ్చివేసి, తెరుచుకున్న బొరియల్లో ఈ ఎరవేసి వేసి మూసివేయాలని సూచించారు. మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో నూకలు, నూనె, విషం కలిపిన ముందు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ ముందు పసిపిల్లలకు దూరంగా ఉంచాలని సూచించారు….

Read More

రాష్ట్రంలో దుర్మార్గపాలన- -వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ గుడాల గోపి

పాలకొల్లు: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరిగోపాల్రావు, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం బయటకు తీసుకు వచ్చారన్నారు. వారు ఇచ్చిన, హామీలు నిలబెట్టుకోలేక, సూపర్ సిక్స్ పథకాన్నించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్,…

Read More

ఏపీలో నాటుకోత్సవాలు, నంది అవార్డులు.

విజయవాడ: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో ఎంతోమంది కళాకారులు ఎదురుచూస్తున్న నంది అవార్డుల కార్యక్రమం త్వరలో ప్రారంభించనున్నట్టు, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం వెల్లడించారు. మా-ఏపీ సంస్థ నిర్వహించిన రఘు చిత్ర ఉత్సవాల్లో కందుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి, నంది నాటక ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. సినీ,నాటక రంగానికి సంబంధించి నంది అవార్డుల విధానాన్ని…

Read More

హత్యకు దారి తీసిన స్నేహితులు మధ్య ఘర్షణ. -విలేకరుల సమావేశంలో వెల్లడించిన డి.ఎస్.పి శ్రీ వేద

పాలకొల్లు: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) జున్నూరుకు చెందిన ముగ్గురుస్నేహితులు గత నెల 25న అధికంగా మద్యం సేవించడం వల్ల ఘర్షణ సంభవించింది అన్నారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో హత్య గురించి వివరాలు వెల్లడించారు. గత నెల 26న యువకుడు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. పోడూరు మండలం జున్నురుకు చెందిన జక్కంపూడి నాగ సాయి కిషోర్, తంగేళ్ల వెంకటేశ్వరరావు లను విచారించారు. వీరు…

Read More

ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వ మానవతా దృక్పదం -మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 2 (తెలుగు న్యూస్ పవర్) ప్రజల ఆరోగ్యం పట్ల తెలుగుదేశం జనసేన బిజెపి తో కూడిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు,స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ సహాయంకు అర్హులైన 59 మందికి, 24.65 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైసిపి…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణం.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరిగాయి. పవళింపు సేవతో మంగళవారం రాత్రి కి సంపూర్ణం అయ్యాయి. అర్చక స్వాములు స్వామివారికి పుష్ప ఉత్సవం చేశారు. అంతరాలయంలో స్వామి వారిని, అమ్మవారిని కొలువు తీర్చి, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. తిరుమంజనములు, ద్వాదశ తిరువారాధన, దర్పణసేవ, ధూప సేవ జరిగింది. ప్రత్యేక పూలతో అలంకరించిన ఏకాంత పవళింపు మందిరంలో…

Read More

ఉపాధి హామీ 200 రోజులకు పెంచాలి.

యలమంచిలి: ఫిబ్రవరి, 2(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం 200 రోజులకు పొడిగించాలని, కనీస వేతనం 600 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఐద్వా , సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఏనుగువానిలంక, చించినాడలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు దేవ సుధాకర్, సిపిఎం నాయకులు మాచవరపు సుబ్బారావు, ఐద్వా నాయకురాలు జయప్రద, పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) నవ నరసింహ క్షేత్రాల్లో ప్రముఖమైన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, మంగళవారం స్వామివారికి తెప్పోత్సవం జరిగింది. ఉత్సవాల్లో 9వది, ఆఖరి రోజున, ఆలయానికి ఉత్తరాన ఉన్న, నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరులో, స్వామివారు, దేవేరులు తెప్పోత్సవం లో విహరించారు. కనుల పండుగగా జరిగిన, ఈ దృశ్యం తిలకించడానికి భక్తజనుల రెండు కళ్ళు సరిపోలేదని, తన్మయత్వంతో…

Read More

మావుళ్ళమ్మకు భక్తులు బంగారం బహుకరణ.

భీమవరం: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) భీమవరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి, ఎనిమిది గ్రాముల బంగారం, (లక్షా పదివేల రూపాయలు) వాడపల్లి వాస్తవ్యులు పున్నం నూకరాజు, షణ్ముఖ సూర్య దుర్గ దంపతులు సోమవారం, అమ్మవారికి కానుకగా సమర్పించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, పూజలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేష వస్త్రం, అమ్మవారి చిత్రం, ప్రసాదాలు అందజేశారు. ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఉద్యోగిని పై దాడిని ఖండించిన సంఘ నాయకులు.

పాలకొల్లు:ఫిబ్రవరి,2 (తెలుగు న్యూస్ పవర్) విధి నిర్వహణలో ఉన్న పరిసరాలు،పరిశుభ్రం కార్యదర్శి షేక్ షకీనా పై సోమవారం దాడి జరిగినట్టు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. స్థానిక కోడి గట్టు, సచివాలయం-2 విధులు నిర్వహిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ నోటీసు అందచేయటానికి అందజేయడానికి మసీదు సెంటర్లో ఉన్న ఒక షాపు వద్దకు వెళ్లారు. ఈసందర్భంగా,కార్యదర్శి షకీనా పై ఎం. శ్రీనివాస్, ధనలక్ష్మి అనేవారు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే వారు పోలీస్…

Read More