Skip to main content

Telugu News Power

ఏపీలో నాటుకోత్సవాలు, నంది అవార్డులు.

విజేతలతో మంత్రి కంతులు దుర్గేష్

విజయవాడ: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో ఎంతోమంది కళాకారులు ఎదురుచూస్తున్న నంది అవార్డుల కార్యక్రమం త్వరలో ప్రారంభించనున్నట్టు, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం వెల్లడించారు. మా-ఏపీ సంస్థ నిర్వహించిన రఘు చిత్ర ఉత్సవాల్లో కందుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి, నంది నాటక ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. సినీ,నాటక రంగానికి సంబంధించి నంది అవార్డుల విధానాన్ని మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు. ప్రవేశపస రుసుము లేకుండా నిర్వహించిన ప్రదర్శనలో 203 చిత్రాలు ప్రదర్శించారు. విజేతలకు మంత్రి దుర్గేష్ అవార్డులు అందజేశారు. ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం శుభ సూచకమన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు సుమారు 2వేల మంది పాల్గొన్నారు.