Telugu News Power

పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయస్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రం.

నర్సాపురం:డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంక గ్రామంలో సైయంట్, కృత్రిమ మేధా(ఏ ఐ) ఫ్యూచర్ స్కిల్స్ హబ్, స్థానిక డిజిటల్ భవన్ లో ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు రెండు అవగాహన ఒప్పందాలపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామ సమక్షంలో సంతకాలు జరిగాయి. తొలి అవగాహన ఒప్పందం స్థానిక జిల్లా పరిపాలన యంత్రాంగం, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ మధ్య కుదిరింది. వీరు నైపుణ్య అభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఎగుమతి సంసిద్ధతపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ…

Read More

పెదమైనవానిలంకకు భారతదేశంలో రెండో స్థానం-కేంద్రమంత్రి నిర్మలా సీతారామమన్ వెల్లడి.

నరసాపురం: డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) భారతదేశంలో ఉన్న 700 జిల్లాల్లో పెదమైవానిలంక, నైపుణ్య శిక్షణ కేంద్రం రెండవ స్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధానం మేరకు పార్లమెంట్ సభ్యులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, నిర్మల సీతారామ ఈ గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర బడ్గం జిల్లా మొదటి స్థానంలో నిలువగా, పెదమైనవానిలంక, విశ్వకర్మ శిక్షణ కేంద్రం రెండో స్థానం సాధించినందుకు తనుకు సంతోషంగా…

Read More

జిల్లా ప్రధాన కార్యదర్శిగా క్రాంతి ఏకగ్రీవం.

యలమంచిలి, డిసెంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి క్రాంతి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మండలం, పెంటపాడు లో జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పిఎస్ విజయరాజు జిల్లా అధ్యక్షులుగా, పి శివప్రసాద్ జిల్లా కోశాధికారి పదవులకు ఎంపికయ్యారు. ప్రస్తుతం క్రాంతి జిల్లా ఇంచార్జ్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యుటిఎఫ్ సంఘానికి వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరు స్థానిక…

Read More

చరిత్ర సృష్టించిన క్రిస్మస్ వేడుక

పాలకొల్లు: డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర్) క్రైస్తవులు, క్రైస్తవం, ఏదో ఒక మతానికి, కులానికి మాత్రమే పరిమితం అయ్యింది కాదని, ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగిన ఒక జీవన విధాన మార్గమనిస్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి సొంత క్యాంపు కార్యాలయ ఆవరణలో శనివారం రాత్రి క్రిస్మస్ పండుగ బాహుబలి స్థాయిలో, ఘనంగా జరిగింది. ఏటా ధర్మారావు ఫౌండేషన్ తరపున ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుతారు. ఈ ఏడాది ఈ క్రిస్మస్ వేడుకలు మరింత శోభాయమానంగా…

Read More

సంక్రాంతికి వస్తున్నాం, అయితే బరులు రెడీ, పందాలే తరువాయి

పాలకొల్లు:డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర్) ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభమై వచ్చేనెల 14 వరకు కొనసాగుతూంది. ఆడపడుచు గొబ్బెమ్మలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతాలు పలుకుతున్నారు. హరిదాసుల అప్డేటెడ్ వెర్షన్తతో ఖరీదైన ద్విచక్ర వాహనాల నెత్తిన అక్షయపాత్ర పెడుతున్నారు. ఒకప్పుడు హరిదాసులు సాంప్రదాయబద్ధంగా, తమకంఠ స్వరంతో పౌరాణిక గాధలు, తత్వాలు పాడేవారు, ఇప్పుడవి బ్లూటూత్ స్పీకర్లలో వినిపిస్తున్నారు. బుడబుక్కల వారు తెల్లవారుజామున మూడింటికి పల్లెల్లో ప్రవేశించేవారు. ఇప్పుడు డిగ్రీలు చదివిన బుడబుక్కల వారు అందరిలాగే ఉదయాన్నే బయలుదేరుతున్నారు. ఇప్పటికే వారి…

Read More

పడవ యజమానులకు చెక్కుల పంపిణీ

పాలకొల్లు: డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర) స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రజలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, శనివారం మత్స్యకారులకు చెక్కులు పంపిణీ చేశారు. వరదల విపత్తు కారణంగా, కాజ్వే మునిగిపోవడం, ప్రజల దైనందిన జీవన ప్రయాణానికి ఇబ్బంది పడటం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక, ఈ సమస్య లేకుండా, కూటమి ప్రభుత్వం వారు ప్రజలకు పడవలు ఏర్పాటు చేశారు. ఈ పడవల సొంతదారులకు రెండు విడతలుగా సొమ్ములు చుక్కల రూపంలో చెల్లించారు. మొదటి విడత 3.90 లక్షలు, రెండవ విడత…

Read More

తూర్పు కాపు సమస్య పరిష్కరిస్తాం- గుడాల గోపి

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పపర్) తూర్పు కాపులను ఓబీసీలుగా గుర్తించడానికి ఇది సరైన సమయమని పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి వెల్లడించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తూర్పు కాపు నాయకులతో శుక్రవారం మాట్లాడారు. గతంలో ఈ సమస్యపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించామన్నారు. అయితే అప్పుడు సమయం లేకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కరించ లేకపోయామన్నారు. ఈ విషయమై జగనన్న కలిసి మరోసారి విజ్ఞప్తి చేద్దామని ప్రకటించారు….

Read More

బడుగుల ఆశాజ్యోతి రంగా -మంత్రి నిమ్మల రామానాయుడు నివాళి

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పవర్) బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని రాష్ట్ర జలవన రుల శాఖామాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు. పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక మారుతి థియేటర్ సెంటర్ వద్ద రంగా కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రంగా కోసం ఒకప్పుడు ఎందరో నాయకులు ఎదురుచూసేవారన్నారు. కూటమి ప్రభుత్వం రంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చేగొండి…

Read More

రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఓ విలన్ – మంత్రి నిమ్మల ఆరోపణ

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పేపర్) రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఓ విలన్ల మారారని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. స్థానిక వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి, సుందరీకరణ పనులకు శుక్రవారం కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందుకుగాను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కోటిన్నర రూపాయలు మంజూరు చేయించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినిమాల్లో ప్రతినాయకుడు పాత్రలాగే, జగన్ కథ కూడా త్వరలోనే ముగుస్తుందని తెలిపారు….

Read More

స్వామి వారిని దర్శించుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి

పాలకొల్లు:డిసెంబర్,26 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామిని శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ సురేష్ కుమార్ దంపతులు దర్శించి,పూజలు చేశారు. కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో, శేష వస్త్రం బహుకరించి సత్కరించారు. ఆలయ పర్యవేక్షకులు పి వాసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More