అమరావతి: జూలై, 7( తెలుగు న్యూస్ పవర్. కాం) అగ్రిగోల్డ్ బాధితులకు
త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ఏర్పాటైన మంత్రుల బృందం మంగళవారం వెల్లడించారు. మంత్రుల బృందం సమావేశంలో రాష్ట్ర మంత్రులునాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత,
అనగాని సత్యప్రసాద్, సత్యం కుమార్ యాదవ్ (వీడియో కాన్ఫరెన్స్ లో) పాల్గొని, అగ్రిగోల్డ్ కేసుల పురోగతి, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.బాధితుల హక్కుల పరిరక్షణకు, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితుల కోసం మంత్రుల బృందం ఏర్పాటు.
అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం చర్చిస్తున్న మంత్రుల బృందం