భీమవరం: జులై, 7( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా కల్పశ్రీ కే.ఆర్.ను ప్రభుత్వం నియమించింది. ఇంతవరకు రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్త కలెక్టర్ గా పని చేశారు. కల్పశ్రీ కె. ఆర్. 2022 బ్యాచ్‌కు చెందిన భారత పరిపాలనా సేవ (ఐఏఎస్) అధికారిణి. ఆమెకు ఆంధ్రప్రదేశ్ కేడర్ కేటాయించారు. వీరిది సాధారణ గ్రామీణ నేపథ్యం.
యూ పి ఎస్ సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన స్ఫూర్తి ప్రదాతగా ఆమె పేరుగాంచారు.కల్పశ్రీ కె. ఆర్.
మార్చి 25, 1995లో
కర్ణాటకలోని తుమకూరు జిల్లా, యీరగుంటలో జన్మించారు.
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2021లో అఖిల భారత ర్యాంక్ 291 సాధించారు. వీరు
జవహర్ నవోదయ విద్యాలయలో చదువుకున్నారు.
బెంగళూరులోని ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బి.ఇ. పూర్తి చేశారు.ఇంజినీరింగ్ తర్వాత కొద్దికాలం విప్రోలో పనిచేశారు. తన లక్ష్యం ఇది కాదని తెలుసుకొని ఉద్యోగాన్ని విరమించారు. పూర్తికాలం యూ పి ఎస్ సి పరీక్షకు సన్నద్ధమయ్యారు.
నాలుగో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులై
మంచి ర్యాంకు సాధించారు.
ఆమె ఐచ్ఛిక అంశంగా భూగోళశాస్త్రం ఎంపిక చేసుకున్నారు.
వారికుటుంబంలో
తండ్రి, కంఠప్ప వై.బి. పట్టు సిల్క్ శాఖలో దినసరి కూలీగా మొదలై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయికి ఎదిగారు.సోదరుడు,లక్ష్మీకాంత్ భారత సైన్యంలో దేశ రక్షణకు సేవలందిస్తున్నారు.
భర్త,అభిషేక్ గౌడ ఎం.జె. 2020 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వీరి
వృత్తి జీవితం
2022లో ఐఏఎస్ గా ప్రారంభమైంది.శిక్షణ సమయంలో పల్నాడు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. రంపచోడవరంలో సబ్ కలెక్టర్‌గా సేవలందించారు. తర్వాత ఆమెను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ ( విజిలెన్స్) లో పనిచేశారు.కర్ణాటకలోని ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల నుంచి యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన తొలి విద్యార్థుల్లో ఒకరిగా ఆమె పేరు రికార్డులకు ఎక్కింది . పట్టుదల, కృషికి ఆమె జీవితం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా కల్పశ్రీ కె. ఆర్.
కల్పశ్రీ, నూతన సంయుక్త కలెక్టర్