పాలకొల్లు, సెప్టెంబర్,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు–I, II, మహిళా సాధికారత విభాగం,లయన్స్ రూరల్ క్లబ్, పాలకొల్లు వారి సంయుక్త ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, గర్భాశయ ముఖాద్వార కేన్సర్ నిరోధక టీకా ఆవశ్యకత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె . రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గుణ్ణం సుజయ శ్రీ హాజరై విద్యార్థినులకు ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, మహిళల ఆరోగ్యం, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. సర్వైకల్ క్యాన్సర్‌ను ముందస్తు జాగ్రత్తలు, క్రమం తప్పని వైద్య పరీక్షలు, అందుబాటులో ఉన్న టీకా ద్వారా నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థినులు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.లయన్స్ రూరల్ క్లబ్ అధ్యక్షులు కె. అజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళల ఆరోగ్య పరిరక్షణకు తమ క్లబ్ తరఫున అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉందని, యువతలో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ జి సుమలత,ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఎం రామకృష్ణ, డాక్టర్ వి డి వి విజయలక్ష్మి, మహిళా సాధికారత విభాగం కన్వీనర్ షమీమ్, వి రమేష్, కే రోహిత్, కే స్వర్ణలత , ఐ భాగ్యలక్ష్మి, ఎమ్ శిరీష,లయన్స్ రూరల్ క్లబ్ ప్రతినిధులు జయప్రకాష్, డాక్టర్ ఎస్వీ రంగారావు, కారుమూరి రామలింగేశ్వరరావు, శైలజ,కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
అద్దేపల్లి కళాశాలలో వ్యక్తిగత పరిశుభ్రత, గర్భాశ్రయ ముఖద్వార కేన్సర్ టీకాపై అవగాహన కార్యక్రమం.
విద్యార్థినులకు సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ సుజయ శ్రీ