Skip to main content

Telugu News Power

శ్రీ మావూళ్ళమ్మ ఆలయంలో బాలల నృత్య ప్రదర్శన.

బాల కళాకారులతో ఆలయ కమిటీ

భీమవరం:సెప్టెంబర్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, గణపతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ దివ్య డాన్స్ అకాడమీ, డాన్స్ మాస్టర్ దివ్య ఆధ్వర్యం లో శ్రీ కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఆలయ ధర్మకర్త అతికెల ఆంజనేయ ప్రసాద్ కుమార్తె, అతికెల బేబీ అంజని నాగ సాయి, ఇతర బాల నృత్య కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాన్స్ మాస్టర్ దివ్య, విద్యార్థులకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ అతికేలా ఆంజనేయ ప్రసాద్ గుసిడి జానకి నాగ శిరీష కారెంపూడి ఆదిలక్ష్మి మల్లువలస లక్ష్మి నిర్మల శేషవస్త్రం, ధ్రువ పత్రం, ప్రసాదం తో సత్కరించారు.