Skip to main content

Telugu News Power

అభ్యర్థుల కోసం గెలుపు దీక్ష తీసుకోండి. -కూటమి శ్రేణులకు, మంత్రి నిమ్మల పిలుపు.

అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల, జిల్లా అధ్యక్షులు రామరాజు

పాలకొల్లు: అక్టోబర్,21
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి దీక్ష తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో, జిల్లా టిడిపి అధ్యక్షులు రామరాజు, రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు,జిల్లా ఇంచార్జ్ మంత్రి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ భాష్యం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, కూటమి అభ్యర్థుల పరిచయ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి శ్రేణులు ఇంటింటికి వెళ్లి ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది సమగ్రంగా ఓటర్లకు వివరించాలని సూచించారు. గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం విధ్వంసంతో, అభివృద్ధి ఏ విధంగా సున్న చుట్టింది ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో, పాలకొల్లు నియోజకవర్గంలో కూటమి పార్టీ తరఫున పోటీ చేస్తున్న, అభ్యర్థులకు, కండువాలు కప్పి సమావేశానికి పరిచయం చేశారు. సీట్ల కేటాయింపులో సమీకరణాల ఫార్ములా, సత్ఫలితాలు ఇవ్వడంతో అసంతృప్తి రాకుండా, లేకుండా జాగ్రత్త పడ్డారు. నిమ్మల ఆశీస్సులతో ఐకమత్యంతో విజయం సాధిస్తామని అభ్యర్థులు ధీవ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు,బోనం చినబాబు, యర్రంశెట్టి ఉన్నమట్ల కపర్ది,దాసరి రత్నం రాజు, పాలవలస తులసిరావు, పెనుమత్స రామ భద్రరాజు, కొడవటీ వరబాబు, మామిడి శెట్టి పెద్దిరాజు, పాముల రజిని కుమార్, ఇంటి శ్రీరాముడు, రామచంద్ర రాజు తదితర పలువురు నాయకులు పాల్గొన్నారు.

అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో ఎంపీ భాష్యం రామకృష్ణ, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్