పాలకొల్లు: అక్టోబర్,6
(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆశ వర్కర్ల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, గౌరవ వేతనం పేరుతో వారి శ్రమ దోచుకోవటం తగదని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు ఏ రవి పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఆశా వర్కర్లు మంగళవారం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు క్యాంపు కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి కాబట్టి మైండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు దైవ సుధాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు వలే పనులు చేయించుకుని, వారికి కనీస వేతనం కూడా చెల్లించకపోవడం అన్యాయం అన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి లక్ష్మి మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్యపరంగా, గర్భిణీ సమయంలో కాన్పులప్పుడు, ఎంతో విలువైన సేవలు అందిస్తున్నప్పటికీ, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇవ్వకపోగా, నాణ్యమైన ఏకరూప దుస్తులు కూడా ఇవ్వని దుస్థితి ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. బీమ సౌకర్యం రూ. 10 లక్షలు చేయాలని, గ్రాట్యూటీ పై ఉన్న నియంత్రణ పరిధి ఎత్తివేయాలని, అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో, సంఘ జిల్లా కమిటీ సభ్యులు టి.అమ్మాజీ, డి. నిర్మల కుమారి, సూర్యవతి, బి జానకి, పి నాగమణి ఆర్. సునీత, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
డిమాండ్ల సాధన కోసం ఆశ వర్కర్ల ప్రదర్శన