
పాలకొల్లు: అక్టోబర్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్)
దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్
కే. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో వరుణ జపం, జలాభిషేకాలు మంగళవారం జరిగాయి. దేవస్థానం చైర్మన్ మీసాల రామచంద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు,అభిషేక పండితులు బమ్మిడిపాటి వెంకన్న,మద్దూరి సూరిబాబు, ప్రధాన అర్చకులు కిష్టప్ప , అనిల్, వీరబాబు సుమారుగా 500 మంది భక్తులు పాల్గొన్నారు.
శ్రీ స్వామివారి సేవలో
కార్య నిర్వహణ అధికారి,రాపాక శ్రీనివాసరావు, సూపర్డెంట్, పి.వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.