Skip to main content

Telugu News Power

ఇంధన కొరత లేకుండా చూడాలి. -అధికారులకు మంత్రి ఆదేశాలు

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పెట్రోలు, డీజిల్ ఇంధన కొరత లేకుండా చూడాలని,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులుమంత్రి నిమ్మల రామాల రామానాయుడు ఆదేశించారు. జిల్లా అధికారులతో మంత్రి ఇంధన కొరతపై టెలికాన్ఫరెన్స్ సోమవారం నిర్వహించారు. ప్రస్తుత ఇంధన కొరతకు సంబంధించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత వరి కోతలు ముమ్మరంగా ఉన్న సందర్భంగా, రైతులకు, ఆక్వా రైతులకు ప్రాధాన్యత ఇచ్చి ఇంధనం సరఫరా చేయాలని సూచించారు. కొన్ని ఏజెన్సీల సరఫరా పూర్తిస్థా యి చేయకపోవడం వల్ల, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్ల, అవసరానికి మించి ఇంధనం నిలువ చేయటం వల్ల, యుద్ధం ముగిసాక ధరలు పెరుగుతాయని అపోహలు సృష్టించటం వల్ల తాత్కాలిక ఇబ్బంది ఎదురయిందని మంత్రి వివరించారు. గత ఏడాది ఏప్రిల్ లో 92.59 లక్షల లీటర్ల డీజిల్ సరఫరా అయిందని, 74.23 లక్షల లీటర్ల డీజిల్ ఇప్పటికే సరఫరా అయినట్టు మంత్రి వెల్లడించారు. ఇందల కొరత లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు కూపన్ ల ద్వారా
డీజిల్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తగినంత డీజిల్ సరఫరా కావడం వల్ల ఒకటి రెండు రోజుల్లో సమస్య తీరిపోతుందని మంత్రి హామీ ఇచ్చారు