Telugu News Power

ట్రోలింగ్ మధ్య టాప్ ర్యాంక్: ఓ బాలిక ధైర్యం

అందమైన లోకమని, రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి, ఆశలు ఈ లోకానికి మూలమమ్మ, ఆకలికి అందం ఉందా? ఆశలకు అంతం ఉందా? అంటూ తత్వాన్ని బోధించారు మనసు కవి ఆత్రేయ. అందమైన గులాబీకి కూడా ముళ్ళు ఉంటాయి, కానీ తన సహజ సమ్మోహన వాసనకు అవి అడ్డు కాదన్నారు కూడా. ఇంతకీ ఈ ఉపమానం ఎందుకు అనుకుంటున్నారా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రాచి నిగం అనే విద్యార్థి గురించి ఓ కధనం ఇప్పుడు చూద్దాం. దేవుని సృష్టిలో అంతా ఖచ్చితంగా ఉండదు. అది దైవ కార్యమైన సరే. అందమైన చందమామకు కూడా దేవుడు మచ్చ పెట్టాడు. అలాగే కొందరిలో కొన్ని అసహజమైన లోపాలు దేవుడు సృష్టించినవి. సైన్స్ ప్రకారం చెప్పుకోవాలంటే, హార్మోన్ల సమతుల్యం లేకపోవడం వల్ల కొన్ని ప్రకృతికి విరుద్ధంగా మార్పులు జరుగుతుంటాయి. అయితే, అది కేవలం భౌతికమైనది మాత్రమే. మానవమేధస్సుకు, శారీరికలోపలకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు. ఎదుటివారి లోపాలను ఎత్తి చూపి, పైసాచికానందం పొందే కొందరు, లోపాలు ఉన్న వారిని వేధింపులకు గురి చేయటం క్రూరమైన అలవాటు. అది వారికి ఎద్దు పుండులా కనిపిస్తుంది, పొడుచుకు తినటానికి కాచుకుని ఉంటారు‌ కానీ ఆ లోపాన్ని, తద్వారా వచ్చే మానసిక కృంగుబాటును లెక్కచేయకుండా ముందుకు సాగిపో పోయేవారు కొందరు ఉంటారు వారిలో ఒకరు ప్రాచీ నిగం. ఆమె బాలిక అయినప్పటికీ, మగ పిల్లలా మూతిపై మీసం కనిపిస్తుంది. దేవుడిచ్చిన లోపం ఈ లోకానికి పరిహాస వస్తువు. కానీ నిగం ఈ తుచమైన వాటిని ఏమీ పట్టించుకోకుండా, తన చదువు పట్ల శ్రద్ధ పెట్టింది. పదవ తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలిచింది. అయినా ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు. ఆన్లైన్ లో కూడా అంతే వేధింపులు. రెండేళ్లు గడిచాయి, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విలువడ్డాయి. ప్రాచీ నిగం ఈ పరీక్షల్లో
అందమైన లోకమని, రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మ, ఆకలికి అందం ఉందా? ఆశలకు అంతం ఉందా? అంటూ తత్వా ముళ్ళు ఉంటాయి, కానీ తన సహజ సమ్మోహన వాసనకు అవి అడ్డు కాదన్నారు కూడా. ఇంతకీ ఈ ఉపమానం ఎందుకు అనుకుంటున్నారా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రాచి నిగం అనే విద్యార్థి గురించి ఓ కధనం ఇప్పుడు చూద్దాం. దేవుని సృష్టిలో అంతా ఖచ్చితంగా ఉండదు. అది దైవ కార్యమైన సరే. అందమైన చందమామకు కూడా దేవుడు మచ్చ పెట్టాడు. అలాగే కొందరిలో కొన్ని ఆంజనేయమైన నో పాలు దేవుడు సృష్టించినవి సైన్స్ ప్రకారం చెప్పుకోవాలంటే హార్మోన్ల సమతుల్యం లేకపోవడం కొన్ని ప్రకృతికి విరుద్ధంగా మార్పులు జరుగుతుంటాయి అయితే అది భౌతికమైనది మాత్రమే. మానవమేధస్సుకు శారీరికలోపలకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు. ఎదుటివారి లోపాలను ఎత్తి చూపి పైసాచికానందం పొందే కొందరు, లోపాలు ఉన్న వారిని హేళన చేయటం క్రూరమైన అలవాటు. అది వారికి ఎద్దు పుండు లా కనిపిస్తుంది, పొడుచుకు తినటానికి కాచుకుని ఉంటారు. కానీ ఆ లోపాన్ని, తద్వారా వచ్చే మానసిక కృంగుబాటును లెక్కచేయకుండా ముందుకు సాగిపో పోయేవారు కొందరు ఉంటారు వారిలో ఒకరు ప్రాచీ నిగం. ఆమె బాలిక అయినప్పటికీ మగ పిల్లల వలె మూతిపై మీసం కనిపిస్తుంది. దేవుడిచ్చిన లోపం ఈ లోకానికి పరిహాస వస్తువు. కానీ నిగం ఇవి ఈ తుచ్చమైన వాటిని ఏమీ పట్టించుకోకుండా, తన చదువు పట్ల శ్రద్ధ పెట్టింది. పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది. అయినా ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు లేదు. ఆన్లైన్ లో కూడా అంతే వేధింపులు. రెండేళ్లు గడిచాయి, 12వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ప్రాచీ నిగం ఈ పరీక్షల్లో 91.2 శాతం మార్కులతో మరోసారి తన ప్రతిభ నిరూపించుకుంది. గణితంలో 99 శాతం, రసాయన శాస్త్రంలో 95 శాతం, భౌతిక శాస్త్రంలో 93 శాతం, హిందీలో 96 శాతం, ఆంగ్లంలో 73 శాతం మార్కులు సాధించింది. జేఈఈ మెయిన్స్ వంటి పరీక్షల్లో విజయం సాధించి,ఇంజనీరింగ్ లో తన ప్రతిభ నిరూపించుకోవాలనుకుంటున్న ట్టు తెలిపింది. తనకు మద్దతుగా నిలుస్తున్న వారికి, వేధిస్తున్న వారికి కూడా తను కృతజ్ఞతలు తెలియజేసింది. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం.