Telugu News Power

ఈ నెల 30న రొయ్యల మేత షాపుల బంద్. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు.

పాలకొల్లు: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏ విధమైన నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా రొయ్యల మేత తయారీ ఫ్యాక్టరీలు భారీగా పెంచిన ధరలు తగ్గించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్టు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శుక్రవారం జరిగిన సమావేశంలో తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 30న మేత దుకాణాలన్నీ బంధు పాటించాలని పిలుపునిచ్చారు. ఆక్వా రైతులకు మద్దతుగా మేత షాపుల నిర్వాహకులు స్వచ్ఛందంగా దుకాణాలు బందు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అదే రోజు రైతులు అందరూ రియల్ పట్టుబడి పట్టకుండా ఆ ఒక్కరోజు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమం రైతులు మేత డీలర్లు సామాన్యతో సమిష్టిగా, స్వచ్ఛందంగా పూర్తిగా విజయవంతం చేయాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతుల ఐక్యతను, బలాన్ని ప్రభుత్వానికి, ఫ్యాక్టరీలకు తెలియజేయటానికి వీలువుతుందని కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తెలిపారు.