
జనరల్ డస్క్: జూన్,26( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వివిధ రకాల వ్యాధులు రావటం సహజం. వీటితోపాటు కొన్ని రకాల కీటకాల కూడా ఉద్భవించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే వీటి గురించి బయట ప్రపంచానికి తెలియ రావడం లేదు. బాధితులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం దృష్టికి రాక నివారణ చర్యలు ఇంతవరకు ప్రారంభం కాలేదని బాధితులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో
యాసిడ్ పురుగు, బీటిల్ బగ్ దాడికి గురైన కుటుంబాల వారు పరామర్శిల జోరు కొనసాగుతున్నది. పసిపిల్లలు ఈ ఎగర దాడి వల్ల ఎక్కువగా బాధ పడుతున్నారు
తూర్పు గోదావరి జిల్లా కడియపులంక, కొవ్వూరు.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో యాసిడ్ పురుగులు (నైరోబి బీటిల్స్) వ్యవసాయ కూలీలు, రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కడియం, కడియపులంక ప్రాంతాల్లోని నర్సరీల్లో
ఈ పురుగులు రైతులు, కూలీల చర్మంపై వాలినపుడు ఆ చర్మ ప్రాంతం కాలిపోయినట్టుగా మారిపోతున్నాయి. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్‌గా పిలిచే యాసిడ్ పురుగుల బెడద ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇళ్లలోకి ప్రవేశిస్తూ చిన్నారులు, వృద్ధులు, మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గ్రామాల్లో పలువురు ఈ పురుగుల బారిన పడి చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. మొదట సాధారణ పురుగులుగా భావించి చేతులతో నలిపివేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. అక్కడి ప్రజలకు సైతం చర్మం కాలిపోయినట్టుగా మారిపోతోంది. వీటిని రెండు జిల్లాల ప్రజలు యాసిడ్ పురుగులని పిలుస్తున్నారు. ఈ పురుగుల శరీరంలో ఉండే పెడెరిన్ అనే విషపదార్థం చర్మంపై పడిన వెంటనే మంట, దురద, ఎర్రటి దద్దుర్లు, నీటి పొక్కులు ఏర్పడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. కొందరిలో గాయాలు మరింత తీవ్రమై చికిత్స తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతోందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.యాసిడ్ పురుగులుగా పిలుస్తున్న ఇవి రోవ్ బీటిల్స్ (నైరోబీ ఈగ) అనబడే పీడెరస్ ప్రజాతికి చెందిన రెండు జాతుల ఈగలివి. తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా నుండి ఉద్భవించాయి. ఈ బీటిల్స్‌లో పెడెరిన్ అనే తినివేసే పదార్థం ఉంటుంది, ఇది చర్మానికి తగిలితే రసాయన కాలిన గాయాలను కలిగిస్తుంది. ఈ కాలిన గాయాల కారణంగా.. నైరోబీ ఈగను “డ్రాగన్ బగ్” అని కూడా పిలుస్తారు. పెద్ద బీటిల్స్ ప్రధానంగా నలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి 6–10 మిమీ పొడవు, 0.5–1.0 మిమీ వెడల్పు ఉంటాయి. వాటి తల, ఉదరం, రెక్కలు నల్లగా ఉంటాయి, అయితే వక్షోభాగం, పై ఉదరం ఎరుపు రంగులో ఉంటాయి. ఈ బీటిల్స్ తేమతో కూడిన ఆవాసాలలో నివసిస్తాయి. పంట తెగుళ్ళను తినడం వల్ల తరచుగా వ్యవసాయానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పెద్ద ఈగలు కృత్రిమ కాంతి వనరుల వైపు ఆకర్షించబడతాయి, ఫలితంగా అవి అనుకోకుండా మానవుల శరీరాలపై వాలతాయి.
వాతావరణంలో ఎల్ నినో వల్ల కురిసే భారీ వర్షాలు, నైరోబీ ఈగ వృద్ధి చెందడానికి అనువైన పరిస్థితులను కల్పిస్తాయి. ఇవి 1998లో వీటి వ్యాప్తి సంభవించింది. యాసిడ్ బగ్ (నైరోబీ ఫ్లై) అనేది ‘పెడెరిన్’ అనే తీవ్రమైన విషాన్ని స్రవించే కీటకం. ఇది చర్మంపై పడితే తీవ్రమైన మంట, ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు వస్తాయి. వీటిని పొరపాటున నలిపినా లేదా కొట్టినా ఈ విషపూరిత రసాయనం చర్మంపై కారుతుంది.
ఈ పురుగు విషం చర్మంపై పడిన 12 నుంచి 36 గంటల్లో ఎర్రటి మంటలు, దద్దుర్లు, పుండ్లు ఏర్పడతాయి.చేతికి అంటిన ఈ పురుగు విషం కంటికి తగిలితే కళ్ళు ఎర్రబడటం, తాత్కాలిక దృష్టి లోపం వంటి సమస్యలు వస్తాయి. ఈ పురుగులు కుట్టవు. కానీ, ఒంటిపై వాలితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో నలపకూడదు లేదా కొట్టకూడదు. పురుగును సున్నితంగా ఊదివేయాలి లేదా ఏదైనా కాగితంతో పక్కకు నెట్టేయాలి. పురుగు పాకిన శరీర భాగాన్ని సబ్బుతో కడగాలి. ఒకవేళ పొరపాటున చర్మంపై విషం పడితే, ఆ ప్రాంతాన్ని వెంటనే సబ్బు లేదా సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. వర్షాకాలంలో లేదా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పూట ఇంట్లో లైట్లు వేసినప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. దోమతెరలను ఉపయోగించడం ద్వారా ఈ పురుగుల బారి నుండి రక్షణ పొందవచ్చు. రోవ్ బీటిల్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కీటక సమూహాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఇవి సాధారణంగా తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, తోటలు, చెరువుల పరిసరాల్లో నివసిస్తాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల రెండు జిల్లాలో వర్షాలు, తేమ శాతం పెరగడంతో ఈ పురుగుల సంచారం కూడా అధికమైందని చెబుతున్నారు. ఫాగింగ్ చేపట్టండని ప్రభుత్వాన్ని బాధితులు వేడుకుంటున్నారు.
యాసిడ్ పురుగుల బెడదను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. వీటివ్యాప్తి ఉన్న గ్రామాల్లో ఫాగింగ్ నిర్వహించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, పురుగుల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోవ్ బీటిల్స్ వెలుతురుకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. కాబట్టి ఆరుబయట ఎల్ఈడీ ల్యాంపులు పెట్టి, వాటికి దిగువన టబ్ లేదా గిన్నెలో సబ్బు నీళ్లు పోసి ఉంచితే యాసిడ్ పురుగులు ఆకర్షించబడి ఎల్ఈడీ లాంప్ చుట్టూ తిరుగుతూ సబ్బు నీటిలో పడి చనుపోతాయి. తద్వారా వాటి సంతానోత్పత్తి తగ్గిపోతుంది.