Telugu News Power

ఆక్వా రైతులను సీఎం ఆదుకోవాలి. -మాజీ ఎమ్మెల్సీ అంగర విజ్ఞప్తి

మాజీ ఎమ్మెల్సీ అన్నగారు రామ్మోహన్రావు

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాలా కాలంగా ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడటానికి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని, రైతులను ఆదుకోవాలని అంగర విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి 12 శాతం ఆదాయం ఆక్వా రంగం నుంచి లభిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో కేవలం 10 శాతం ధర తగ్గితే స్థానిక మార్కెట్లలో సగానికి సగం ధర తగ్గించి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిండికేట్ల ముఠా ఈ దారుణాలకు ఒడికడుతున్నట్టు వెల్లడించారు. ఆర్టీవో, తహసిల్దార్ పర్యవేక్షణలో కనీసం మద్దతు ధరకు కోనేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. కాని పక్షంలో రొయ్యల రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.