పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం ఆయా క్లస్టర్లలో ఘనంగా జరిగాయి. వినూత్న విధానాల్లో, వికేంద్రీకరణ పద్ధతిలో తొలిసారి ప్రవేశపెట్టిన క్లస్టర్ స్థాయి మహానాడు రెండు రోజులపాటు ఘనంగా జరిగింది. వేడంగి కాలువ సమీపంలో, దొడ్డిపట్ల కాపు కళ్యాణ మండపంలో, యలమంచిలి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో, పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్ లో, లయన్స్ కమ్యూనిటీ హాల్ లో, చంద్రపూర్ రోడ్డులో ఎస్ ఎస్ ఎస్ కళ్యాణ మండపంలో, భగ్గేశ్వరం, సూర్య తేజ ఫంక్షన్ హాల్ ఈ వేడుకలకు వేదికలయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన టిడిపి పార్టీ శ్రేణులు, ఆద్యంతం ఉత్సాహభరితమైన వాతావరణంలో మహానాడు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు, యువ నేత నారా లోకేష్ ప్రసంగాలు వర్చువల్ విధానంలో ఎల్ఈడి స్క్రీన్ లపై నేరుగా ప్రసారం చేయటంతో, టిడిపి శ్రేణులు ఆసక్తిగా తిలకించారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్త పార్టీ కోసం కష్టించి పనిచేయాలని మంత్రి నిమ్మల కోరారు. మంత్రి రామానాయుడు పై నేపద్య గాయకులు పాడిన పాటలకు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మహానాడుకు హాజరైన వారికి చక్కని ఆహారం, పానీయాలు సంతృప్తికరంగా ఏర్పాటు చేశారు. మంత్రి మంగళగిరిలో ఉన్నా, మనసంతా తన పాలకొల్లు నియోజకవర్గం పై పెట్టి ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయటంతో రెండు రోజులపాటు జరిగిన మహానాడు కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు పాముల రజిని కుమార్, మామిడి శెట్టి పెద్దిరాజు, రుద్రరాజు రమేష్ రాజు, బీసీ సెల్ అధ్యక్షులు కర్నేని గౌరునాయుడు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, పెనుమత్స రాంభద్ర రాజు, మాత రత్నం రాజు, ఆరమిల్లి రామ శ్రీనివాస్, దేవళ్ళ ప్రసాద్, బొప్పన హరి కిషోర్, బాలాజీ,బోనం నాని, చెరుకూరి అంజిబాబు, ముచ్చర్ల శ్రీనివాసరావు, పొట్నూరి శ్రీనివాసరావు, కలిదిండి రామచంద్ర రాజు, పలువురు మహిళా నాయకురాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే వివిధ కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఈ మహానాడు కార్యకర్తల్లో మంచి జోష్ నింపింది.