Telugu News Power

కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయుష్ సేవలు ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

వైద్య శిబిరాన్ని సందర్శిస్తున్న కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆయుర్వేద వైద్య సేవల శిబిరం కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ చదలవాడ నాగరాణి, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. దేశీయ ఆయుర్వేదం పట్ల ప్రజలు అనిపించుకోవాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్,బీపీ, చర్మరోగాలకు
కీళ్లవ్యాధులకు ఉచితంగా మందులు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ వైద్య సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అందిస్తున్న సేవలు గురించి కలెక్టర్ కు డాక్టర్ శ్రీరామ్ వివరించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 100 మంది వైద్య సేవలు తోపాటు మందులు ఉచితంగా పొంగినట్టు డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారం(పి జి ఆర్ ఎస్) కోసం ప్రతి సోమవారం వచ్చే అర్జీదారులు, అధికారులు స్వామి కార్యం, స్వకార్యం ఒకేసారి, ఒకే చోట పొందే అవకాశం లభించింది. కేవలం బిపి పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలకు ఔషధాలు అందజేశారు. ఎక్కువమంది షుగర్ పరీక్ష కోసం అడిగారు.