Telugu News Power

గ్రంథాలయ శిబిరాలలో బాలల సెలవులు సద్వినియోగం చేసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి పిలుపు.

బాలల్లో బాలలుగా, కలెక్టర్ జెసి డిఇఓ

మవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) బాలల భవిష్యత్తు కోసం, స్థానిక గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న 31 శిక్షణా శిబిరాల్లో పాల్గొని, సెలవులు సద్వినియోగం చేసుకోవాలని, కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. స్థానిక వీరమ్మ చెరువు పార్క్ వద్ద గల, గ్రేడ్ వన్ గ్రంధాలయాన్ని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు సోమవారం సందర్శించారు. వేసవిలో నిర్వహిస్తున్న విజ్ఞాన శిక్షణ తరగతులు జాతుల భావి జీవితానికి ఎంతగానో తోడ్పడతాయన్నారు. ఇష్టమైన అభిరుచికి తగ్గట్టుగా, నైపుణ్యాలు నేర్చుకోవచ్చునన్నారు. నైతిక విలువలతో కూడిన జీవననైపుణ్యాలు, మంచి భవిష్యత్తు బాటలు వేస్తాయన్నారు. ఈ సందర్భంగా, వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల గోడ పత్రిక ఆవిష్కరించారు. శిక్షణలో పాల్గొంటున్న 70 మంది బాలలకు వ్రాత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, గ్రంథాలయ కార్యదర్శి శేఖర్ బాబు, ఈ. నారాయణ, కమిషనర్ కె రామచంద్రారెడ్డి, తాసిల్దార్ రావి రాంబాబు, గ్రంధ పాలకులు ఎస్ వెంకటేశ్వరరావు, మానవత వెంకటపతి రాజు, వడ్డీ వెంకటేశ్వరరావు, శిక్షకులు,రమేష్ నాయుడు, ఉమాశ్రీ (కంప్యూటర్స్), డి శ్యామ్ (నృత్యం), కలిగొట్ల గోపాల శర్మ (నైతిక విలువలు) తదితరులు పాల్గొన్నారు.