పాలకొల్లు: అక్టోబర్,10
( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ కాంప్లెక్స్ ద్వారా ఎందరో క్రీడాకారులు తెలుగులోకి వచ్చారని క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. గత 25ఏళ్లుగా టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను తమకు ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఏటా నిర్వహించే జాతీయస్థాయి సీనియర్ ర్యాంకింగ్, 45 నుంచి 75 ఏళ్ల వయసు క్రీడాకారులకు, ఈనెల 16 నుంచి 22 వరకుటోర్నమెంట్ నిర్వహించనున్నట్టు భగవాన్ రాజు వెల్లడించారు. డబుల్స్ విజేతలకు రూ. 3 లక్షలు ప్రైజ్ మనీ ప్రకటించారు. నర్సాపురం ఆఫీసర్స్ క్లబ్, పాలకొల్లు టౌన్ హాల్, కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లలో ఏకకాలంలో రెండేసి జట్లు ఆటలో పాల్గొంటాయని వివరించారు. క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, బూన్ రాజు, డి టి డి సి బాబు, దేవరపు లక్ష్మీనారాయణ, కటారి నాగేంద్ర కుమార్, కోసూరి రమేష్ రాజు, కనుమూరి సీతారామరాజు, రవి రాజు పాల్గొన్నారు.
కాస్మో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ టెన్నిస్ టోర్నమెంట్. -స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గాంధీ భగవాన్ ప్రకటన.
టెన్నిస్ టోర్నమెంట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న దృశ్యం