
ఏరియా ఆసుపత్రికి చేరిన రూ. 1.25 కోట్ల వైద్య పరికరాలు.
పాలకొల్లు:అక్టోబర్,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) పేద, మధ్య తరగతి వర్గాలకూ ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక వంద పడకల ఏరియా ఆసుపత్రికి రూ. 1.25 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం ఏడాదిన్నరలో పూర్తి కావలసిన ఆసుపత్రి భవనాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆసుపత్రి పనులు పునరుద్ధరించామని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం సుందరీకరణ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఇమ్మిడి సత్యనారాయణ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి
రూ. 24.30 కోట్ల నిధులు మంజూరైనట్టు మంత్రి వెల్లడించారు. ఈ వైద్య పరికరాలకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈ సి ఐ ఎల్), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ( సి ఎస్ ఆర్) నిధులు మంజూరు చేసింది. సంయుక్త కలెక్టర్ కల్పశ్రీ, ఈసీఐఎల్ డిఫెన్స్ జనరల్ మేనేజర్,శార్వరీ దేవి, సి ఎస్ ఆర్ ఆఫీసు ఇంచార్జ్, డాక్టర్ పి. వేణుబాబు, డిప్యూటీ మేనేజర్, జే. సునీల్ కుమార్, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మురళి, నర్సాపురం ఆర్డీవో దాసి రాజు, మాజీ ఎమ్మెల్సీ, అంగర రామ్మోహన్ రావు, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కోడి విజయభాస్కర్ నూతన వైద్య పరికరాలు ప్రారంభించారు. మంత్రి రామానాయుడు అత్యవసర సమావేశం కారణంగా అమరావతి వెళ్లిన సందర్భంగా, చరవాణిలో తన ప్రసంగాన్ని వినిపించారు. మంత్రి తరఫున కూటమి నాయకులు, సంయుక్త కలెక్టర్ కల్ప శ్రీ, ఈసీఐఎల్ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. జిల్లా వైద్యాధికారి, పి. సూర్యనారాయణ, ఆసుపత్రి సూపరిండెంట్ యర్రా మాధురి, డాక్టర్, జనార్ధన్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు,కర్నెన్ని గౌరునాయుడు, వల్లభు శ్రీనివాస్, ఉన్నమట్ల కపర్తి, కొల్లి కొండ ప్రసాద్, పెనుమత్స రాంభద్రరాజు, రియా, చిన్నమిల్లి గణపతి రావు, మామిడిశెట్టి పెద్దిరాజు, సురేష్, ధనాని సూర్యప్రకాష్, పీతల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.