Telugu News Power

కొంతేరు యూత్ క్గబ్ నాటికోత్సవాలు ప్రారంభించిన మంత్రి నిమ్మల.

మంత్రి నిమ్మలను సత్కరిస్తున్న యూత్ క్లబ్ ప్రతినిధులు
అనిల్ అర్క ను సత్కరిస్తున్న యూత్ క్లబ్ ప్రతినిధులు

యలమంచిలి: మే, (తెలుగు న్యూస్ పవర్. కామ్) కొంతేరు యూత్ క్లబ్, నాటికోత్సవాలు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలపరుల శాఖామాత్యులు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభకు అధ్యక్షులు అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షులు బోనం రవి సభకు స్వాగతం పలికారు. జాతీయస్థాయి గుర్తింపు కలిగిన ప్రతిష్టాత్మక కొంతేరు యూత్ క్లబ్ సేవలను మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రముఖ టీవీ, సినీ నటులు, నిర్మాత, స్థానికులు ఖండవల్లి అనిల్ అర్క ను ఘనంగా సత్కరించారు. 44వ నాటికోత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు తితిక్ష, తరమెవెళ్ళిపోతున్నదో, రెండో రోజు అమ్మ చెక్కిన బొమ్మ, భువి కోరని భ్రమణం, అందరూ మంచివారే కానీ, మూడవరోజు ఇది అతని సంతకం, అగ్నిసాక్షి నాటికలు ప్రదర్శిస్తారు. అనంతరం బహుమతి ప్రధానోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి, జనసేన నాయకులు బోనం చినబాబు, చేగొండి సత్యనారాయణమూర్తి, ప్రముఖ రచయిత, గుణ నిర్ణేత, క్లబ్బు కార్యదర్శి గంటా కళ్యాణి నాయుడు, జవ్వాది శ్రీనివాసులు నాయుడు, అంబటి నవీన్ చంద్, బోడపాటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.