Telugu News Power

రైతు విశ్రాంతిభవనం ప్రారంభించిన మంత్రి నిమ్మల.

మంత్రి నిమ్మలతో ఏఎంసి కమిటీ సభ్యులు

పాలకొల్లు: మే, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆవరణలో ఉన్న రైతు విశ్రాంతిభవము స్థానానికి శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు శనివారం ప్రారంభించారు. రైతు విశ్రాంతి భవనాన్ని రూ. 42 లక్షల నిధులతో ఆధునికీకరించారు. ఈ సందర్భంగా, ఏఎంసీ చైర్మన్, కోడి విజయభాస్కర్, వైస్ చైర్మన్ దాసరి రత్నం రాజు తమ డైరెక్టర్ల బృందంతో కలిసి పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఉన్నమట్ల కపర్తి, తులా రామలింగేశ్వరరావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, పెనుమత్స రాంబద్ర రాజు, బిట్ట లక్ష్మీనారాయణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.