Skip to main content

Telugu News Power

క్షీరారామంలో సప్త ప్రదక్షిణలు.

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న భక్తులు

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం మాడవీధులలో శ్రీ స్వామివారి చుట్టూ ఏడు ప్రదక్షిణాలు పూర్తిచేసి శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. సప్త ప్రదక్షిణాలలో పాల్గొన్న భక్తుల సుమారు 250 మంది పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ సూపరింటెండెంట్ పసుపులేటి వాసు,ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్, అర్చకులు వీరబాబు, పాల్గొన్నారు.తద నంతరం రాత్రి దూపసేవ, పంచహారతుల సేవలో కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.