
పాలకొల్లు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో జరిగిన శ్రీ పార్వతి సమేత వీరా రామలింగేశ్వర స్వామి వార్లు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామి వార్లు కళ్యాణోత్సవాల సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అన్న సమారాధనకు ఎస్బిఐ సుధీర్, చక్కా వారి కుటుంబ సభ్యులు, భక్తులు తమ సౌజన్యం అందించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అన్నదాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కర్నేని గౌరు నాయుడు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తహసిల్దార్ ఎడ్ల దుర్గాప్రసాద్, సీఐ రజిని కుమార్, కనక దుర్గ ఆలయ చైర్మన్ తులా రామలింగేశ్వర రావు, పెనుమాక రామ్మోహన్రావు, చుండూరి శ్రీ రంగయ్య నాయుడు, జక్కంపూడి కుమార్, కొల్లి కొండ ప్రసాద్, శిడగం సురేంద్ర, చక్కా మాణిక్య కుమార్, శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, ఉప్పులపు పెద్దిరాజు, కొండ్రెడ్డి సూరిబాబు, హోతా ప్రవళి, నాలం సురేఖ, ఆలయ సిబ్బంది పసుపులేటి వాసు, చిట్టూరి గాంధీ తదితరులు తమ సేవలు అందించారు. సుమారు పదివేల మంది భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరించినట్టు దేవస్థానం వారు అంచనా వేస్తున్నారు.