-కూటమి శ్రేణులకు మంత్రి నిమ్మల పిలుపు.
పాలకొల్లు: అక్టోబర్, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
కూటమి శ్రేణులు గడపగడపకు వెళ్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ గురించి ఓటర్లకు వివరించాలని మంత్రి నిమ్మల పిలుపునిచ్చారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, శుక్రవారం కూటమి శ్రేణుల ప్రముఖులతో, స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లష్టంగా ఉన్నప్పటికీ, దాదాపు 1200 కోట్ల రూపాయల నిధులతో పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే అగ్రస్థాయిలో, ఆదర్శంగా నిలపాలని చేస్తున్న కృషిని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం స్ట్రైక్ రేటుతో, అన్ని స్థానాల గెలిపి లక్ష్యంగా కూటమి శ్రేణులు శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ పాలలో జరిగిన విధ్వంసాన్ని, ఈ రెండేళ్లలో ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సమగ్రంగా సవివరంగా తెలియజేయాలని కోరారు. పార్టీ శ్రేణులు ఎన్నికలు ముగిసే వరకు నిరంతరం శ్రమించాలని కోరారు. నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.