పాలకొల్లు నియోజకవర్గంలో జనసేనకు 10 ఎంపీటీసీ స్థానాలు.
యలమంచిలి:అక్టోబర్,23
(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి జడ్పిటిసి, జనసేన పార్టీ అభ్యర్థిగా కొడవటి నాగలక్ష్మి నామినేషన్ , భీమవరం జిల్లా పరిషత్ కార్యాలయంలో
శుక్రవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కొడవటి వరబాబు, ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, మంత్రి నిమ్మల రామానాయు డుకు, కూటమి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కొడవటి వరబాబు గత ఎన్నికల్లో జనసేన తరపున జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి వైసిపి పార్టీ జిల్లా పరిషత్ అధ్యక్ష అభ్యర్థి, చాలా మంచిది జడ్పిటిసి కౌరు శ్రీనివాస్ పై పోటీ చేసి ఓటమి చవిచూసారు. మళ్ళీ వెంటనే అవకాశం రావడంతో జనరల్ (మహిళ) స్థానం నుంచి వరబాబు, మంత్రి నిమ్మల ఆశీస్సులతో భార్య నాగలక్ష్మి ని పోటీ లో నిలిపారు.
జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు వీరే:
పోసింశెట్టి వసంత,అగ్గిరాజుపాలెం
ఇంటి సత్యవాణి,బాడవ
చీరాల సూర్యకుమారి,చించినాడ కామిశెట్టి హరికృష్ణ,
ఏనుగువానిలంక, చేగొండి వెంకటస్వామి నాయుడు, బూరుగుపల్లి, యడ్ల మహాలక్ష్మి వేడంగి-1, కొండేటి మంగతాయారు వేడంగి -2
చోరపల్లి అరుణాదేవి,
పెనుమదం
పసనా సాయి లక్ష్మి, తిల్లపూడి స్థానాలుకు జనసేన తరపున నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన శ్రేణుల్లో ఈ మేరకు సంతోషం వ్యక్తమవుతున్నది.