గూగుల్ భారీ ఏఐ హబ్‌కు శ్రీకారం – విజాగ్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి
విశాఖపట్నం: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్) ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి సుమారు 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి రానుంది.
ఈ గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లలో ఒకటిగా నిలువనుంది.
ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత భారతదేశంలో డిజిటల్, క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలను మరింత బలోపేతం చేస్తుంది.
ప్రాజెక్ట్ విశాఖ పరిసర ప్రాంతాల్లోని తర్లువాడ, , రాంబిల్లి ప్రాంతాల్లో విస్తరించనుంది. సుమారు 1 గిగావాట్ సామర్థ్యంతో మూడు డేటా సెంటర్ క్యాంపస్‌లు నిర్మించనున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి శేఖర్, ఉక్కు శాఖ సహాయంమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, గంటా శ్రీనివాసరావు, తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడటంతో పాటు, విశాఖను అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని “డిజిటల్ ఆంధ్రప్రదేశ్” లక్ష్యానికి కీలక మైలురాయిగా అభివర్ణించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ ఏఐ హబ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తెస్తుందని, భవిష్యత్తులో విశాఖను “డేటా సెంటర్ క్యాపిటల్”గా నిలబెట్టే సామర్థ్యం ఉందని తెలిపారు.