Skip to main content

Telugu News Power

శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు సాయికుమార్ రాయలు మృతి.

పెనుగొండ: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్)శ్రీ తుళువ తిమ్మానాయకుని వారసులు, శ్రీకృష్ణదేవరాయల దాయాదులు, తుళువ వంశ చంద్రవంశ క్షత్రియులు, శ్రీ శ్రీ తాతాచార్య వంశ పారంపర్య శిష్యులు, శ్రీ వీరబలిజ, నూరు బలిజ క్షత్రియ సింహాసనులైన, పెనుగొండ సంస్థానాదీశులు శ్రీ రాజా అన్నయ్యగారి సాయికుమార్ రాయలు మంగళవారం స్వర్గస్తులయ్యారు.
శ్రీ బలిజ కాపు క్షత్రియుల కోసం, వంశ గౌరవం కోసం ఆయన చేసిన సేవ, అందించిన ప్రోత్సాహం ఎనలేనిది. బలిజ కాపుల తెలగ క్షత్రియులకు ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆ మహా మనిషి ఆత్మకు శాంతి చేకూరాలని కుల మత భేదరహితంగా అందరూ ప్రార్థిస్తూ, ఘనంగా నివాళులు అర్పించారు.