Skip to main content

Telugu News Power

గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా. -సైకిళ్ళ పంపిణీ సభలో మంత్రి నిమ్మల.

సైకిల్ పంపిణీ చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: అక్టోబర్,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవటానికి ప్రతిక్షణం కష్టపడుతున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బీఆర్ఎంవీ పాఠశాల ఆవరణలో ఆదివారం ఉచితంగా సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తనకున్న నీ అవకాశాలను వ్యక్తిగత స్వార్థానికి వాడుకోకుండా, నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. తాను సేవా భావంతో తన తండ్రి నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రజా ప్రతినిధిగా మరింత ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశంలో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. విద్యకు ప్రోత్సాహకరంగా ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి, 6 నుంచి 10 తరగతుల వరకు విస్తరించినట్టు తెలిపారు. దశలవారీగా అందరికీ సైకిళ్లు ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు. విశాఖపట్నం కి చెందిన జయలక్ష్మి సీ ఫుడ్స్ అధినేత రమేష్ కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ డైరెక్టర్ జాస్తి మహినాథ్ ను ప్రజల సమక్షంలో వేదికపై మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి రామ శ్రీనివాస్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.