Skip to main content

Telugu News Power

టిడిపి శ్రేణులకు త్వరలో ఉచిత వైద్య శిబిరాలు. -మంత్రి నిమ్మల వెల్లడి.

వైద్యులతో సమావేశం నిర్వహిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: అక్టోబర్4( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చెయ్యాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సంకల్పించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద స్థానిక వైద్యులతో సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం పాటుపడుతున్న శ్రేణుల ఆరోగ్యమే పార్టీకి బలమని నమ్మి వారికి ఆరోగ్య సేవలు అందించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి, తద్వారా వైద్య సేవలు అందించి పార్టీ శ్రేణుల ఆరోగ్యాన్ని కాపాడటానికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ పై మంత్రి వైద్యులతో చర్చించారు. పార్టీ శ్రేణులు ఈ వైద్య శిబిరాలు సమర్థవంతంగా నిర్వహించడానికి ముందుకు రావాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణానికి చెందిన పలువు రు వైద్యులు పాల్గొన్నారు.