అక్టోబర్ 15 ఉదయం గం.6 ల నుంచి 16 ఉదయం గం.6 ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.
ద్విచక్ర వాహనాలకూ అనుమతి లేదు.
ప్రజలు ప్రత్యామ్నాయ
మార్గాలలు చూసుకోవాలి.
– జిల్లా కలెక్టర్ మహేష్.
అమలాపురంయలమంచిలి:
అక్టోబర్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్)డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,పశ్చిమ గోదావరి జిల్లా మధ్య 216 జాతీయ రహదారిని అనుసంధానించే దిండి,చించినాడ బ్రిడ్జిపై రోడ్డు బేరింగ్ మరమ్మతు పనుల నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 16వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చించినాడ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు సురక్షితంగా కొనసాగేందుకు అవసరమైన రోడ్డు బ్రిడ్జ్ బేరింగ్ మరమ్మతు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ పనులను సజావుగా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఒకరోజు పాటు వంతెనపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తోందని వివరించారు.
మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో భారీ వాహనాలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సహా ఎలాంటి వాహనాలను వంతెనపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా, చించినాడ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే ప్రజలు, వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ విజ్ఞప్తి చేసారు.