Telugu News Power

చెరువు భూమిలో అక్రమ ఇళ్ల తొలగింపు . అర్హులకు ప్రభుత్వ ఇళ్ళు -కలెక్టర్ భరోసా.

ఆక్రమణ ల తొలగింపులో నిన్ను కోల్పోయిన వారితో మాట్లాడుతున్న కలెక్టర్ నాగరాణి, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

వీరవాసరం: మే ,2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
మత్స్యపురి గ్రామం చెరువు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల తొలగింపు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి బాధితులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. తొలగించిన ఇళ్లలో అర్హత కలిగిన 16 మందిని గుర్తించి, వారికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రుణాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. డ్వాక్రా సంఘాల ద్వారా కూడా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో రెవెన్యూ, పోలీసు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.