పాలకొల్లు: మే,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.397 కోట్ల నిధులు మంజూరైనట్టు రాష్ట్ర జనవరిలో శాఖ మాత్యులు, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం వెల్లడించారు. జల వనరుల శాఖ తరపున ముఖ్యమంత్రి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో చివరి ఎకరం వరకు నీటి సరఫరా జరగాలని లక్ష్యంతో, రైతులకు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇప్పటివరకు సుమారు రూ.1100 కోట్ల నిధులు కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. అత్యవసరంగా అవసరమైన, కాలువలు,చెరువులు, రిజర్వాయర్లు, బావుల కోసం ఈ నిధులు కేటాయించినట్టు తెలిపారు. వేలకోట్ల సాగునీటి ప్రాజెక్టులు నిర్వహణ లేక, కనీసం కందెన వేసే పరిస్థితి కూడా లేక గత ప్రభుత్వంలో గేట్లు కొట్టుకుపోయి అపార నష్టం జరిగిందని గుర్తు చేశారు. వచ్చే సార్వా నాటికి ఈ పనులు పూర్తయ్యేలా, ముఖ్య ఇంజనీర్ దగ్గర నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు మే నెల అంతా కృషి చేయాలని మంత్రి సూచించారు. పనులన్నీ పారదర్శకంగా నీటి సంఘాలు, అధికారుల పర్యవేక్షణలో జరగాలన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ళలో కాలువల నుంచి తట్టమట్టి పూడిక కూడా తీయలేదని ఆరోపించారు. కాలువల్లో గుర్రపు డెక్క, తూడు, కిక్కిస పెరిగి కాలువల మూసుకు పోయిన తొలగించ లేదన్నారు. ప్రస్తుతం విడుదలైన ఓ అండ్ ఎం నిధులు అత్యవసర పనులకు ఖర్చు పెడతామన్నారు. అందువల్ల జలధార, జలహారతి కార్యక్రమంలో భాగంగా, భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
జలవనరుల శాఖకు రూ. 397 కోట్ల నిధులు. నామినేషన్ పై రూ. 10 లక్షల లోపు పనులు. -మంత్రి నిమ్మల వెల్లడి.
నిధుల విడుదలపై ప్రకటన చేస్తున్న మంత్రి నిర్మల