Skip to main content

Telugu News Power

ఛాంబర్స్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దృష్టి దినోత్సవం. బాడవ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం.

బాడవ లో వైద్యశిబిరం ప్రారంభిస్తన్న దృశ్యం

పాలకొల్లు: అక్టోబర్, 8
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
బిఆర్ ఆర్, జీకేఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్స్ 1, 2, 3 సంయుక్త ఆధ్వర్యంలో యలమంచిలి మండలం బాడవా గ్రామంలో అంతర్జాతీయ దృష్టి దినోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. స్థానిక ఎం.పీ.యుపి పాఠశాల వద్ద రాజవల్లి రాధా రామన్ లైయన్స్ కంటి ఆసుపత్రి పాలకొల్లు వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం, షుగర్ పరీక్షలు చేశారు. నిర్వహించడం జరిగింది. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కంటి జాగ్రత్తలు గురించి సూచనలు ఇచ్చారు. బాడవ,ఏనుగువానిలంక గ్రామ ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరయ్యారు.
విశేషంగా సందర్శించి కంటి పరీక్షలు 110 మందికి,షుగర్ పరీక్షలు 96 మందికి ఉచితంగా చేసారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వారికి, ఆసుపత్రులకు దూరంగా ఉండే వారికి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు తమ లైయన్స్ హాస్పిటల్ ద్వారా అందిస్తామని, కళాశాల ద్వారా ఇలాంటి క్యాంపులు నిర్వహించడం జరుగుతుందాన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లను, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించారు. కళాశాల సెక్రటరీ కెవి సీతారామరాజు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు,కటారి నాగేంద్ర కుమార్, సెక్రటరీ చాంబర్ ఆఫ్ కామర్స్,
ఏ భాను ప్రకాష్,ప్రెసిడెంట్ లైయన్స్ ఐ హాస్పిటల్, బి. దుర్గారావు, డి వెంకట్రావు, నారిన మురళీకృష్ణ, ఎంపీపీ స్కూల్ బాడవ, టి.రాధా మాధవి, కె. రాంబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ , వైద్య శిబిరంలో 20 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్థానిక నేతలు పాల్గొన్నారు.